Share News

One Side Love: పెట్రోల్ పోసి టీచర్‌కు నిప్పు పెట్టి విద్యార్థి

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:26 PM

పాఠాలు చెప్పే టీచర్‌ను స్కూల్ విద్యార్థి ప్రేమించాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆమె.. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లింది.

One Side Love: పెట్రోల్ పోసి టీచర్‌కు నిప్పు పెట్టి విద్యార్థి

భోపాల్, ఆగస్ట్ 20: స్కూల్‌లో పాఠం చెప్పిన టీచర్‌పై పెట్రోల్‌తో దాడి చేసి.. ఆమెను ఒక విద్యార్థి తీవ్రంగా గాయ పరిచాడు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌ నర్సింగ్‌పూర్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. 18 ఏళ్ల సూర్యాంశ్ కొచ్చార్.. తనకు స్కూల్‌లో పాఠం చెప్పే టీచర్‌పై ప్రేమ పెంచుకున్నాడు. ఈ విషయాన్ని స్కూల్ టీచర్‌కు తెలిపారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదే విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి టీచర్ తీసుకు వెళ్లింది. దీంతో సూర్యాంశ్ కొచ్చార్‌పై స్కూల్ యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. ఆ క్రమంలో అతడికి స్కూల్ యాజమాన్యం టీసీ ఇచ్చి పంపించేసింది.


అనంతరం అతడు మరో స్కూల్‌లో జాయిన్ అయ్యారు. అయితే ఆగస్టు 15. స్వాతంత్ర్య దినోత్సవం. ఈ సందర్భంగా స్కూల్ టీచర్ కొత్త చీర కట్టుకుంది. ఈ సందర్భంగా ఆమెను సూర్యాంశ్ కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన టీచర్.. అతడిపై మండిపడింది. ఈ నేపథ్యంలో ఆమెపై అతడు కోపాన్ని పెంచుకున్నాడు. అందులోభాగంగా ఆగస్టు 18వ తేదీన పెట్రోల్ బాటిల్‌ను టీచర్ ఇంటికి తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత ఆమె శరీరంపై పెట్రోల్ జల్లాడు. అనంతరం అగ్గిపుల్ల వెలిగించి.. ఆమెకు నిప్పంటించాడు. అక్కడ నుంచి అతడు పరారయ్యాడు.


స్థానికులు వెంటనే స్పందించి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆమెకు తీవ్ర గాయాలైనా.. ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్ఫష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సూర్యాంశ్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్యాణ్ పూర్‌లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న తర్వాత.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

యాత్రికులకు అలర్ట్.. ఆగిన పాపికొండల విహారయాత్ర..

సీఎంపై దాడి.. హైటెన్షన్!

యూరియాపై ఫలించిన ఎంపీల పోరాటం

For National News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 12:30 PM