Jugaad Video: వీళ్ల పట్టుదలకు సలాం చెప్పాల్సిందే.. లైట్ లేకపోయినా ఎలా పని చేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Aug 20 , 2025 | 03:34 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడంలో భారతీయులు చాలా ముందుంటారనే సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా కష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొనడంలో భారతీయులు చాలా ముందుంటారనే సంగతి తెలిసిందే. అలాంటి జుగాడ్ వీడియోలు (Jugaad Videos) ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
giggly_editzz అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను (Viral Video) షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రాత్రి వేళ హ్యాండ్ పంప్ (Hand Pump)ను ఏర్పాటు చేసే పని జరుగుతోంది. రాత్రి సమయం కావడంతో అక్కడంతా చీకటిగా ఉంది. అక్కడ లైట్లు లేవు. దీంతో ఓ వ్యక్తి బైక్ లైట్‌తో వెలుతురును సెట్ చేశాడు. బైక్‌ను ఎత్తైన ప్రదేశంలో పెట్టి లైట్ ఆన్ చేసి దాని వెలుతురులో పని చేసుకుంటున్నారు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఎనిమిది వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. బైక్‌ను అంత పైన ఎలా పైన పెట్టారో అర్థం కావడం లేదని ఒకరు కామెంట్ చేశారు. వెలుతురు లేకపోయినా పని ఆగకూడదని మరొకరు పేర్కొన్నారు. ఇతడికి కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందేనని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..