Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై కేంద్రం బిల్లు.. సజ్జనార్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:39 PM
Betting Apps: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీసీ సజ్జనర్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఇప్పటికే చాలామంది బలయ్యారని అన్నారు.
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వేదికగా బెట్టింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని, భారీ జరిమానాలు ఉంటాయని కేంద్రం తెలిపింది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీసీ సజ్జనర్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఇప్పటికే చాలామంది బలయ్యారని అన్నారు. బెట్టింగ్ యాప్స్ నిషేధంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమన్నారు.
బెట్టింగ్ యాప్స్‌తో పాటు మరి కొన్నిటిని నిషేధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ఏ కోశాన కూడా ఇండియాలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. యాప్స్‌పై నిషేధం విధించడంతో నిర్వహణ బాధ్యత కిందిస్థాయి పోలీస్ అధికారులపై ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో యాప్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ దొడ్డి దారిన వస్తున్నారని తెలిపారు. వివిధ మార్గాల ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మళ్లీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
యూరియా ఇవ్వకపోతే తీవ్ర ఉద్యమమే.. తేల్చి చెప్పిన హరీష్ రావు
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు