Heavy Rains in Telangana: భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షం.. పలు కాలనీలు జలమయం
ABN , Publish Date - Oct 06 , 2025 | 08:10 AM
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. వాన భారీగా పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయిపోతున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో వర్షం (Heavy Rains) దంచికొడుతోంది. వాన భారీగా పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వర్షంతో పలు కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానతో రోడ్ల మీదకి వరద నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తోండటంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది.
గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు వర్షంతో తడిసి ముద్దయిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మణికొండ, దిల్ సుఖ్ నగర్, యూసఫ్ గూడ, అబిడ్స్, ఖైరతాబాద్, బోరబండ తదితర ప్రాంతాలల్లో వర్షం పడుతోంది. అయితే ఓ వైపు వర్షం పడుతుండగానే.. మరోవైపు ఎండ కూడా కొడుతోంది. ఈ దృశ్యాన్ని యువత తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.
ఉధృతంగా మూసీ ప్రవాహం..
మరోవైపు.. యాదాద్రి భువనగరి జిల్లాలో ఉధృతంగా మూసీ వరద ప్రవహిస్తోంది. రుద్రవెల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ప్రవహిస్తోంది. మూసీ వరద ప్రవాహంతో భూదాన్ పోచంపల్లి - బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకలు బంద్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, వలిగొండ మండలం భీమలింగం కత్వ వద్ద లోలెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ వరద ప్రవాహంతో చౌటుప్పల్ - భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారీ వర్షం
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 5 గంటల నుంచి పడుతోన్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మన్సూల్ పూర్ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో పిట్లం- కంగ్టి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని దత్తాత్రేయ కాలనీ నీట మునిగింది. నారాయణఖేడ్ పట్టణంలోని ఏఎస్‌నగర్ కాలనీలో రహదారులు జలమయం అయ్యాయి. వర్షం ధాటికి వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జూబ్లీహిల్స్‌కు నలుగురి పేర్లు!
Read Latest TG News And Telugu News