MP Konda On BJP Meeting:బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం.. ఎంపీ కొండా, ఎమ్మెల్యే కాటిపల్లి ఫైర్
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:33 PM
బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు.
హైదరాబాద్, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ ఆఫీస్ బేరర్స్ సమావేశం (BJP office Bearers Meeting) ఇవాళ(ఆదివారం) ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. హాట్‌హాట్‌గా ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల (Local body Elections) వేళ పార్టీలో సమన్వయ లోపంపై మండిపడ్డారు బీజేపీ నేతలు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరుపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (MP Konda Vishweshwar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేతల మధ్య సమన్వయం లేదు..
నేతల మధ్య సరైన సమన్వయం ఎందుకు లేదని ఎంపీ కొండా ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సమన్వయం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను అధిగమించి ముందుకెళ్దామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు (Ramchandra Rao) చెప్పుకొచ్చారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అంశాలపై కమిటీ వేస్తామని రాంచందర్‌రావు తెలిపారు. ఈ నెల 8వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహిస్తామని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
త్రీ మెన్ కమిటీ..
త్రీ మెన్ కమిటీలో జిల్లా ఇన్‌చార్జి, అబ్జర్వర్, జిల్లా అధ్యక్షుడు సభ్యులుగా కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ సభలకు ముఖ్య అతిథులుగా సునీల్ బన్సల్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్‌లు ఉండనున్నారు.
ప్రణాళికలు రచించాలి: ఎంపీ డీకే అరుణ
బహిరంగ సభల బాధ్యత పార్టీ జిల్లాల ఇన్‌చార్జ్‌లకి మాత్రమే అప్పగించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు, ఇన్‌చార్జ్, అబ్జర్వర్‌తో త్రిసభ్య కమిటీతో జిల్లాల వారీగా బహిరంగ సభలకు ప్లాన్ చేయాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. కనీసం 15 జడ్పీ చైర్మన్‌లు గెలవడమే లక్ష్యంగా బీజేపీ హై కమాండ్ ప్రణాళికలు రచించాలని కోరారు. ఎంపీలు ఉన్న చోట స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. మిగతా ప్రాంతాల్లో పార్టీ విస్తరణే లక్ష్యంగా ప్రణాళికలు రచించాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.
క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలేవీ: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
మరోవైపు.. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (MLA Katipally Venkataramana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తోంది..? అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమం డిసైడ్ చేస్తారని.. క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమమే ఎందుకు ఉండదని నిలదీశారు. అలాగే, జిల్లాల్లో పార్టీ నేతల తీరుపై ఎమ్మెల్యే కాటిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాలకు రావడం, వెళ్లడమే తమ పనా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలేవీ..? అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్
Read Latest TG News And Telugu News