Heavy Rain Alert in Telangana: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ABN , Publish Date - Oct 05 , 2025 | 08:28 AM
భాగ్యనగరంలో వర్షం దంచికొడుతోంది. భారీగా వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో వర్షం (Heavy Rains) దంచికొడుతోంది. భారీగా వాన పడుతోండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. జూబ్లీహిల్, బంజారాహిల్స్, ఫిలింనగర్, యూసఫ్‌గూడ, మణికొండ, పెన్షన్ ఆఫీస్, అబీడ్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. ట్రాఫిక్ స్థంభించిపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన దంచికొడుతోండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
జిల్లాలకు ఎల్లో అలర్ట్
క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఈదురు గాలులతో కూడిన వర్షం..
రేపు (సోమవారం) తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.. రేపు (సోమవారం) తెలంగాణలోని 27 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
వికారాబాద్‌లో భారీ వర్షం..
వికారాబాద్‌లో తెల్లవారు జామునుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వానలతో కోటిపల్లి ప్రాజెక్టు అలుగు పారుతోంది. ఉధృతంగా గొట్టిముక్కల వాగు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గొట్టిముక్కల - నాగారం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకలు బంద్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఊటీని తలపిస్తోన్న అనంతగిరి అందాలు..
వికారాబాద్‌లో భారీ వర్షం కురుస్తోండటంతో తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి సోయగాలు ఊటీ అందాలని తలపిస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అనంతగిరి సోయగాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పచ్చని అడవి, కారు మబ్బులు అడవికి తాకుతున్నాయి. మంచుతో కప్పబడి ఉన్న అడవి అందాలను చూసి సంబంరపడుతున్నారు స్థానికులు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలు జరుగుతాయా.. లేదా.. ?
Read Latest TG News And Telugu News