Share News

Minister Prabhakar on Anti Drug Run: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:10 AM

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌తో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Minister Prabhakar on Anti Drug Run: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్
Minister Ponnam Prabhakar on Anti Drug Run

హైదరాబాద్, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) విజ్ఞప్తి చేశారు. ఇవాళ(ఆదివారం) అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘స్టాప్ సబ్స్ టెన్స్ అబ్యూస్’ రన్ జరిగింది. ఈ రన్‌ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. యువతలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని చెప్పుకొచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్.


ఇది అతిపెద్ద ముప్పు అని.. ఇది వారి ప్రతిభను నాశనం చేస్తోందని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌తో యువత ఉజ్వల భవిష్యత్త్‌ని నాశనం అవుతోందని వివరించారు. ప్రతి యువకుడు తానూ మాత్రమే కాకుండా, తన చుట్టూ ఉన్న వారిని కూడా ఈ మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ రన్‌లో అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డీన్, డాక్టర్ కే. మనోహర్, సీఈఓ అపర్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ రన్‌‌లో నాలుగు వందల మందికి పైగా వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.


అక్టోబర్ 5 నుంచి 11 వరకు అపోలో వార్షిక వేడుకలు: డీన్, డాక్టర్ మనోహర్

అక్టోబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ వార్షిక వేడుకలు జరుగనున్నాయని డాక్టర్ కే. మనోహర్ తెలిపారు. తెలంగాణలోని వివిధ మెడికల్ కాలేజీల విద్యార్థులు ఈ వేడుకలో పోటీ పడతారని చెప్పుకొచ్చారు.

PONNAM-PRABHAKAR-14.jpg


ఈ వేడుకలో వివిధ రకాల పోటీలు జరుగుతాయని డాక్టర్ కే. మనోహర్ వివరించారు. పలు విభాగాల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని వెల్లడించారు. ఈ ఉత్సవంలో ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య పోటీలు, అకడమిక్ ఈవెంట్లు జరుగుతాయని తెలిపారు. క్రీడా విభాగంలో క్రికెట్, ఫుట్‌బాల్, చెస్ వంటి పోటీలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. సాంస్కృతిక ప్రదర్శనల్లో నృత్యాలు, గానం, నాటకాలు, షార్ట్‌ ఫిల్మ్, మరెన్నో కళారూపాలు ఉంటాయని తెలిపారు. సాహిత్య విభాగంలో క్విజ్, కవితా రచన, సృజనాత్మక రచన వంటి పోటీలు ఉంటాయని వెల్లడించారు. అకడమిక్ విభాగంలో కేస్ స్టడీస్, పోస్టర్, పేపర్ ప్రెజెంటేషన్లు, మెడికల్ క్విజ్ నిర్వహిస్తామని తెలిపారు. ఇంటరాక్టివ్ వర్క్‌షాప్, వినోదభరిత కార్యక్రమాలు ఉంటాయని డాక్టర్ కే. మనోహర్ వెల్లడించారు.

PONNAM-PRABHAKAR-15.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

స్థానికంపై నేడు కమలదళం భేటీ

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 05 , 2025 | 11:35 AM