MLA Raja Singh: శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 03:04 PM
శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని కాపాడాలని ఏపీ ప్రభుత్వాన్ని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) స్పందించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులపై దాడి చేసిన రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారని.. ఈ విషయం చాలా మంచిదేనని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులపైన దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయనే మంచి సందేశాన్ని పవన్ కల్యాణ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడే బాధ్యత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైన కూడా ఉంటుందని రాజాసింగ్ సూచించారు. శ్రీశైలం జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి యావత్ భారతదేశం నుంచి భక్తులు చాలామంది వస్తారని.. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో రాజకీయ పార్టీల నేతలు కొన్ని పాపాలు అక్కడ చేశారని గుర్తుచేశారు. శ్రీశైలం చాలా పెద్ద పవిత్ర స్థలం, కానీ ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడానికి కుట్రలు చాలాకాలంగా జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ముస్లింలను, క్రైస్తవులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపరిచాయని షాకింగ్ కామెంట్స్ చేశారు రాజాసింగ్.
శ్రీశైలం పవిత్ర ప్రాంతంలోని దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రైస్తవులు ఆక్రమించారని రాజాసింగ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఈ విషయం తెలుసా.. లేదా? వారికి తెలిస్తే, మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మన పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడానికి అలాంటి వ్యక్తులు శ్రీశైలం పవిత్ర స్థలాన్ని పాములా ఎందుకు ఆక్రమించారు? వారిని అక్కడి నుంచి ఎందుకు తొలగించడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు పేరుతో తప్పు చేశాయని విమర్శించారు. ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. దయచేసి ఇక్కడ కూడా అదే తప్పు చేయొద్దని సూచించారు. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ, ఇతర మతాల వారిని వెంటనే సున్నిపెంట ప్రాంతానికి బదిలీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
అభివృద్ధి, సంక్షేమమే.. కాంగ్రెస్ లక్ష్యం: మంత్రి పొంగులేటి
యూరియాతో రాజకీయాలు చేస్తున్నారు..
Read Latest Telangana News And Telugu News