Share News

Minister Ponguleti Srinivas Reddy: అభివృద్ధి, సంక్షేమమే.. కాంగ్రెస్ లక్ష్యం

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:31 PM

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేతలు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుభరోసా రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం రూ.12 వేల చోప్పున 9 రోజుల్లో 9 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు.

Minister Ponguleti Srinivas Reddy: అభివృద్ధి, సంక్షేమమే.. కాంగ్రెస్ లక్ష్యం
Minister Ponguleti Srinivasa Reddy

ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కారణం రాష్ట్ర ప్రజల ఫలితమే అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ(గురువారం) తిరుమలాయపాలెం మండలంలో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని ఎక్కడ తగ్గనివ్వకుండా ప్రభుత్వం పని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ.. ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే.. ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేతలు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుభరోసా రూ.10 వేలు ఇస్తే.. తమ ప్రభుత్వం రూ.12 వేల చోప్పున 9 రోజుల్లో 9 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. పేదలకు గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేక పోయందని, ఈ ప్రభుత్వం 7 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో కోళ్ల ఫారాల్లో, రైస్ మిల్లుల్లో హాస్టల్స్ నిర్వహిస్తే.. ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతును రాజు చేసే పనిలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుటుందని వివరించారు. ధరణిని ఎత్తివేసి, భూభారత్ చట్టాన్ని తీసుకువచ్చి రైతులకు మేలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమానికి ప్రజలే అండగా ఉన్నారని పొంగులేటి హర్షం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో యూరియా కొరతక ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. యూరియాను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని నెలలుగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రంలో రైతులు కష్టాలు పడుతుంటే.. చూస్తున్నారు తప్ప ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే రైతులకు యూరియాను సరఫరా చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం

భారీ వర్షాలు, వరదలు.. నిలిచిన రాకపోకలు

Updated Date - Aug 21 , 2025 | 01:31 PM