Minister Thummala Nageswara Rao: యూరియాతో రాజకీయాలు చేస్తున్నారు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:54 PM
జేపీ నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరతకు, రైతులు ఇబ్బందులు పడటానికి కేంద్రామే ప్రధాన కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని నెలలుగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదని తెలిపారు. యూరియా విషయమై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరితే.. ప్రధాని మోదీ దాని అడ్డుకున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తి ఆగిపోయిందని పేర్కొన్నారు. కావాలనే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు..
కేంద్రం చేతకానితనంతోనే కష్టాలు..
బీజేపీ నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని తుమ్మల నాగేశ్వర రావు హితవు పలికారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వాస్తవాలు అంగీకరించాలని తెలిపారు. యూరియా కోసం కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతగల పదవిలో ఉన్న రామ్‌చందర్‌రావు సోయిలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిదని తమ్మల వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకోలేక బీజేపీ నేతల అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది రైతులను అడ్డుపెట్టుకుని చచ్చిన పార్టీని బతికించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం అవాస్తవాలు మాట్లాడి మీ పార్టీల పరువు తీసుకోవద్దని తుమ్మల స్పష్టం చేశారు. యూరియా సమస్యను కొందరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపట్ల రాష్ట్ర ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తుమ్మల సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక