Minister Seethakka: సొంతింటి ఆడబిడ్డను గోస పెడుతున్నారు.. కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:57 PM
మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని మంత్రి సీతక్క హెచ్చరించారు. సొంత ఇంటి ఆడబిడ్డను గోస పెడుతున్నారని.. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఇది తగునా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని మంత్రి సీతక్క (Minister Seethakka) హెచ్చరించారు. ఇవాళ (శుక్రవారం) గాంధీ భవన్ (Gandhi Bhavan)లో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. సొంత ఇంటి ఆడబిడ్డను గోస పెడుతున్నారని.. మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు ఇది తగునా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా కాంగ్రెస్ (Mahila Congress) భాగస్వామ్యం కానుందని ఉద్ఘాటించారు. మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణమే కాదని.. వారిని బస్సుల ఓనర్లను చేశామని ఉద్ఘాటించారు. అభయహస్తం నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాజేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు.
రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలు..
మరోవైపు... రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ (Bathukamma) సంబరాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం రవీంద్రభారతిలో పువ్వుల బతుకమ్మపాటను ఆవిష్కరించారు. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పువ్వుల బతుకమ్మ పాటను So Star సంస్థ నిర్వాహకులు రూపొందించారు. సింగర్స్ గడ్డం సంతోష్, శ్రీనిధి పువ్వుల బతుకమ్మ పాటను ఆలపించగా.. నయని పావని నటించింది. ఈ సందర్భంగా సింగర్స్, నాయని పావనీని మంత్రి సీతక్క, కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ సన్మానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..
కేసీఆర్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: మాగంటి సునీత
For More TG News And Telugu News