Share News

Kishan Reddy on Farmers: రైతులు అధైర్యపడొద్దు.. మేము అండగా ఉంటాం: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:53 PM

అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్‌కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్‌రెడ్డి తెలిపారు.

Kishan Reddy on Farmers: రైతులు అధైర్యపడొద్దు.. మేము అండగా ఉంటాం: కిషన్ రెడ్డి
Kishan Reddy on Cotton Farmers

ఢిల్లీ, అక్టోబర్7 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతుల (Cotton Farmers)కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) భరోసా కల్పించారు. అన్నదాతలు తక్కువ ధరకు పత్తిని బయట అమ్మవద్దని.. ఆలస్యమైన సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. పత్తి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పంటని అమ్మాలని సూచించారు. 12 శాతం కంటే తక్కువ తేమ ఉన్న కాటన్ కార్పొరేషన్ కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. పంటని అమ్మడానికి 122 పత్తి కొనుగోలు కేంద్రాలు ఉంటాయని.. ఎవరైనా రైతులను మోసం చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తరపున రైతులకు అండగా ఉంటామని మాటిచ్చారు. పత్తిని చివరి వరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు కిషన్‌రెడ్డి.


పత్తిలో తేమ 12 శాతం మించొద్దు..

పత్తిలో తేమ 12 శాతం మించకుండా ఉండాలని సూచించారు. కాటన్ కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 122 సెంటర్లలో పత్తి కొనుగోలు జరుగుతోందని తెలిపారు. తేమశాతం కొలిచే మిషన్లు కొనుగోలు కేంద్రాల్లో ఉంటాయని వెల్లడించారు. రైతులకు అండగా 122 సెంటర్లలోని కమిటీలు ఉండాలని ఆదేశించారు. ఇవాళ(మంగళవారం) కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో కిషన్‌రెడ్డి ఢిల్లీలో సమావేశం అయ్యారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై గిరిరాజ్ సింగ్‌తో కిషన్‌రెడ్డి చర్చించారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలపై గిరిరాజ్ సింగ్‌కి విజ్ఞాపనలు అందజేశారు కిషన్‌రెడ్డి.


మౌలిక వసతులు పెంచాలి..

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర జోలి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ని తాను కలిశానని తెలిపారు. తెలంగాణ పత్తి రైతుల సమస్యలను వివరించానని పేర్కొన్నారు. తెలంగాణలో కేవలం పత్తి కొనుగోలు ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. తెలంగాణలో మౌలిక వసతులు పెంచాలని సూచించారు. కాటన్ ఉత్పత్తి కేంద్రాలు పెంచాలని దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్ర కోలలో హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తున్నారని, తెలంగాణలో ఎందుకు చేయడం లేదని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ తనను అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. రైతుల్లో అవగాహన తీసుకురావాలని సూచించారు. పత్తిలో తేమశాతం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని సూచించారు కిషన్‌రెడ్డి.


ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి..

రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన తీసుకురావాలని కోరారు. అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్‌కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని వివరించారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగానే పత్తిని ఏరోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని చెప్పుకొచ్చారు. సీసీఐ నుంచి నేరుగా రైతుల ఖాతాకు డబ్బు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో కాటన్ రేటు తక్కువగా ఉందని తెలిపారు. ఉపాధి హామీ నిధులని పత్తిలో తేమ తగ్గించేందుకు రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేయాలని సూచించారు. మహారాష్ట్ర అకోలాలో హై డెన్సిటీ ప్లాంటేషన్ ద్వారా ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం పెరుగుతోందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2025 | 05:07 PM