Kishan Reddy Comments on Heavy Rains: రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్లాలి
ABN , Publish Date - Aug 28 , 2025 | 02:46 PM
తెలంగాణలో మరో రెండు రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై (Heavy Rains) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్పందించారు. భారత హోం మంత్రిత్వ శాఖ వర్షాలపై మానిటరింగ్ చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అన్ని జిల్లాల వారీగా అందుబాటులో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తాను ఎప్పటికప్పుడు కేంద్రానికి అన్ని విషయాలు చెబుతున్నానని వెల్లడించారు కిషన్‌రెడ్డి.
ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. పలుచోట్ల రైల్వేలైన్లు దెబ్బతిన్నాయని.. వీటిని రెగ్యూలర్‌గా మరమ్మతులు చేసేలా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో మరో రెండు రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉందని తెలిపారు. వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో నిధులు లేకపోవడంతో చిన్న చిన్న పనులు కూడా సకాలంలో జరగడం లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్
Read Latest Telangana News and National News