Share News

Kishan Reddy Wishes on CP Radhakrishnan: సీపీ రాధాకృష్ణన్‌.. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించారు: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Sep 09 , 2025 | 09:14 PM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ జీవితం స్ఫూర్తిదాయకని కిషన్‌రెడ్డి కొనియాడారు.

 Kishan Reddy Wishes on CP Radhakrishnan:  సీపీ రాధాకృష్ణన్‌.. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించారు: కిషన్‌రెడ్డి
Kishan Reddy Wishes on CP Radhakrishnan

ఢిల్లీ , సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు (CP Radhakrishnan) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అభినందనలు తెలిపారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కిషన్‌రెడ్డి.


మీ జీవితం స్ఫూర్తిదాయకం..

‘భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌కి హృదయ పూర్వక శుభాకాంక్షలు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి.. క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా (Vice President) విజయం సాధించిన మీ జీవితం స్ఫూర్తిదాయకం. జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర గవర్నర్‌గా మీరు అందించిన సేవలు గుర్తుండిపోతాయి. రాజకీయ, పరిపాలనా రంగంలో మీ నిబద్ధత, నిజాయితీకి మీరు చేసిన ప్రజాసేవకు ఈ పదవి సరైన గుర్తింపు. రాజ్యసభ చైర్మన్‌గా, ఉపరాష్ట్రపతిగా దేశ రాజ్యాంగానికి మరింత వన్నెతెచ్చేలా మీ పదవీకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


రాధాకృష్ణన్‌కి బండి సంజయ్ శుభాకాంక్షలు

భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌కి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బండి సంజయ్.


సీపీ రాధాకృష్ణన్‌కి రఘునందన్ రావు శుభాకాంక్షలు

భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు రఘునందన్ రావు.


సీపీ రాధాకృష్ణన్‌ విజయం దేశానికి గర్వకారణం: తెలంగాణ బీజేపీ

భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌కి తెలంగాణ బీజేపీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ‘ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కి అభినందనలు. సీపీ రాధాకృష్ణన్‌ విజయం దేశానికి గర్వకారణం. ఇది ఎన్డీఏ కూటమి సంకల్పానికి, ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం. రాధాకృష్ణన్‌ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం’ అని తెలంగాణ బీజేపీ పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది తెలంగాణ బీజేపీ.


ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..ఎందుకంటే..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 09 , 2025 | 09:55 PM