Hostel Building Collapse: కుప్పకూలిన హాస్టల్ భవనం.. విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..
ABN , Publish Date - Sep 09 , 2025 | 07:03 PM
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో బాలుర గురుకుల హాస్టల్ భవనంలోని తరగతి గది మంగళవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు తప్పించుకున్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 09: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామంలోని బాలుర గురుకుల హాస్టల్ భవనం ఇవాళ(మంగళవారం) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయాలు అవ్వగా.. పలువురు తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు. హాస్టల్ సిబ్బందితోపాటు స్థానికులు వెంటనే స్పందించి చిన్నారులను జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే, తరగతి గదుల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు భోజనానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.
ఈ ప్రమాదానికి ముందు హాస్టల్‌లోని తరగతి గదిలో 84 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వారంతా ముందుగానే బయటకు వెళ్లడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం తప్పిందని అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. వెంటనే నూతన హాస్టల్ భవనం నిర్మించాలని ఉన్నతాధికారులను తల్లిదండ్రులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
For More Telangana News and Telugu News..