Dasara Celebrations: దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:55 PM
శరన్నవరాత్రులు మరికొద్ది రోజుల్లో ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.
అమరావతి, సెప్టెంబర్ 09: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడిని దేవస్థానం ఉన్నతాధికారులు, అర్చకులు ఆహ్వానించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌తోపాటు అర్చకులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ సారి దసరా నవరాత్రలు 11రోజులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ వారు.. 11 అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదీకాక ఈ ఏడాది దసర నవరాత్రుల వేళ.. విజయవాడ వేదికగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఇటీవల పోరంకిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని , ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్‌తోపాటు బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత సంచలన కామెంట్స్..
For More AP News and Telugu News..