Hydra Demolished in Nadargul: నాదర్‌గుల్‌లో హైడ్రా కూల్చివేతలు.. బాధితులకు న్యాయం
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:47 PM
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్‌గుల్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను(వెంచర్) బుధవారం కూల్చివేశారు. ఇక్కడ 1986లో టెలికాం కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్‌గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది.
హైదరాబాద్, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ (Badangpet Municipal Corporation) పరిధిలో గల నాదర్‌గుల్‌లో హైడ్రా అధికారులు (Hydra Officials) అక్రమ నిర్మాణాలను(వెంచర్) ఇవాళ(బుధవారం) కూల్చివేశారు. ఇక్కడ 1986లో టెలికాం కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్‌గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది.
అయితే, 2016లో ధరణి ద్వారా అక్రమ పాస్‌బుక్కులు సృష్టించి, సొసైటీకి చెందిన భూమిలో మరో నూతన వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దాదాపు 23 ఇంటి నిర్మాణ అనుమతులని అక్రమంగా పొందారు. ఈ అక్రమాలను గమనించిన అసలైన ప్లాట్ యజమానులు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు హైడ్రా ఆశ్రయం తీసుకున్నారు.
ఈ విషయంపై హైడ్రా అధికారులు సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా మంజూరైన పర్మిషన్లను రద్దు చేశారు. అనంతరం అసలైన యజమానులకు వారి ప్లాట్లను తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. వారికి న్యాయం జరగడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైడ్రా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మంత్రం వేస్తానంటూ.. యువతిని ముగ్గులోకి దించిన ఫేక్ బాబా
అడ్లూరిపై వ్యాఖ్యల ఎఫెక్ట్... పొన్నం ఇంటి వద్ద భద్రత పెంపు
Read Latest Telangana News And Telugu News