Digital Arrest Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు కుచ్చుటోపీ... వెలుగులోకి షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 07:15 PM
సైబర్ మోసాలపై పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఎక్కడో ఒక చోట అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతునే ఉన్నారు. తాజాగా ఓ బాధితురాలని సైబర్ మోసగాళ్లు మోసం చేసి భారీగా నగదు దోచుకున్నారు.
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):సైబర్ మోసాలపై (Cyber Fraud) పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్న ఎక్కడో ఒక చోట అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతునే ఉన్నారు. తాజాగా ఓ బాధితురాలకి సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించి భారీగా నగదు దోచుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ బాధితురాలని డిజిటల్ అరెస్ట్ (Digital Arrest) పేరుతో కోటి 95 లక్షల 75 వేల రూపాయల మోసం చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆమె ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేటుగాళ్ల ఆట కట్టించారు. ఈ కేసులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13వ తేదీన డిజిటల్ అరెస్టుకు గురైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేటుగాళ్ల కదలికలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నిందితులు భావ్‌నగర్‌కు చెందిన సయ్యద్ సోయబ్, బెలీం అనాస్‌లను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారులుగా నటించి మహిళను భయపెట్టారు మోసగాళ్లు.
భర్తపై కేసు ఉందని అంటూ బెదిరింపులు, నకిలీ కాల్స్ చేశారు నేరస్తులు. కరెన్సీ వెరిఫికేషన్ పేరుతో RTGS ద్వారా డబ్బు బదిలీలు చేశారు. మ్యూల్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత దుబాయ్‌కు హవాలా మార్గంలో నగదు బదిలీ చేశారు. మొత్తం 22 సైబర్ కేసుల్లో నిందితులు ఇద్దరు బ్యాంక్ ఖాతాలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు సుమారుగా రూ.3.5 కోట్ల లావాదేవీలు చేసినట్లు గుర్తించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.
నిందితుల దగ్గరి నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. అపరిచిత వ్యక్తులు పంపించే మొయిల్స్‌ను క్లిక్ చేయొద్దని కోరారు. అమాయకులను మోసగించే సైబర్ క్రిమినల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ క్రిమినల్స్ అధునాతన సాంకేతికతను ఉపయోగించి అమాయకులను మోసం చేస్తున్నారని.. వీటిపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి...
హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్
మాధవీలతకు బిగ్ షాక్.. కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News