Share News

Rain Alert in Hyderabad: రెయిన్ అలర్ట్.. భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షం

ABN , Publish Date - Sep 21 , 2025 | 08:17 PM

భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది.

Rain Alert in Hyderabad: రెయిన్ అలర్ట్.. భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షం
RAIN Alert in Hyderabad

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం (Heavy Rains) దంచికొడుతోంది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వాన పడుతోంది. మరోవైపు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.


వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులతో కూడిన వాన పడుతుండటంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. వాన పడుతుండటంతో జీఎచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రాబోయే మూడు రోజులపాటు భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..

హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 09:12 PM