Kavitha ON Batukamma: ఎవరి ఆంక్షలకు భయపడేది లేదు: కవిత
ABN , Publish Date - Sep 21 , 2025 | 08:06 PM
తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసింది చింతమడక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉద్ఘాటించారు. ఇవాళ(ఆదివారం) సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.
సిద్దిపేట, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మనం తెలంగాణ వాళ్లమని.. ఎవరి ఆంక్షలకు భయపడేది లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) పేర్కొన్నారు. ఎవరికీ ఈ అడ్డా జాగీరు కాదని చెప్పుకొచ్చారు. ఈ నా జన్మభూమి భవిష్యత్తులో కర్మ భూమి కావచ్చని పేర్కొన్నారు. సిద్దిపేట రావాలంటే కొందరు ఇదేదో ప్రైవేట్ ప్రాపర్టీగా, కేజీఎఫ్ అడ్డాగా భావిస్తున్నారని తెలిపారు. చింతమడక కేసీఆర్‌ను కన్న గడ్డ అని.. ఇక్కడ ఎవరి ఆంక్షలు చెల్లవని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి హరీష్‌రావు అడ్డా నుంచి కవిత సంచలన కామెంట్స్ చేశారు.
ఇవాళ(ఆదివారం) సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో ఎంగిలి పూల బతుకమ్మ (Batukamma) వేడుకల్లో కవిత పాల్గొన్నారు. రామాలయం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు బతుకమ్మను తీసుకొచ్చి మైదానంలో ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు కవిత. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు కవిత.

తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న నమ్మకం ఎవరికీ లేని నాడు గులాబీ జెండాతోపాటు ముందుకు కేసీఆర్ సాగారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసింది చింతమడక అని ఉద్ఘాటించారు. ఈ గడ్డ నుంచి ఒక ఉద్యమం పుట్టిందని, దాని నుంచి దేశ చరిత్ర మారిందని నొక్కిచెప్పారు. ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితిలో తాను చింతమడకకి వచ్చానని తెలిపారు. చింతమడక నేర్పిన సంప్రదాయం, ధైర్యంతో తెలంగాణ అంతా తిరిగి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటానని కవిత ఉద్ఘాటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..
హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..
Read Latest Telangana News And Telugu News