HarishRao: రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో తెలంగాణకు ఏం సాధించారు.. హరీష్‌రావు ప్రశ్నల వర్షం
ABN , Publish Date - May 03 , 2025 | 01:47 PM
HarishRao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ వెళ్లి తెలంగాణకు ఏం సాధిస్తున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని హరీష్‌రావు విమర్శలు చేశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) 42 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా.. తెలంగాణకు సాధించింది ఏం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) విమర్శించారు. ఇవాళ(శనివారం) ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు జరిగే నష్టంపై నోరు మెదపకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. వారి జీవితాలతో ఆడుకుంటుందని హరీష్‌రావు మండిపడ్డారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని హరీష్‌రావు ఆరోపించారు. రాష్ట్రానికి మంజూరైనా MGNREGS (నరేగా) పనిదినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని అన్నారు. 2024-25లో రూ.12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా, ఈ సంవత్సరం కేవలం రూ. 6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నరేగా పనిదినాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4 నెలల వేతనాలు చెల్లించాలని హరీష్‌రావు కోరారు.
పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం:పెద్ది సుదర్శన్ రెడ్డి
పత్తి కొనుగోళ్లలో రూ.3వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని విమర్శించారు. రైతులు క్వింటాకు రూ.2వేలు నష్టపోయారని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం నాడు మీడియాతో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రైతు దగ్గర క్వింటాల్ పత్తిని రూ.5వేలకు కొనుగోలు చేసి... బ్రోకర్లు రూ.7 వేలకు పైగా దండుకున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.
పత్తి కొనుగోళ్ల వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. సీసీఐ, మార్కెటింగ్ అధికారులు పత్తి రైతులను మోసం చేశారని ఆరోపించారు. పత్తి కొనుగోళ్లను సీసీఐ ఆలస్యం చేయటంతోనే.. రైతులు నష్టపోయారని చెప్పారు. కేవలం 20శాతం మంది రైతులే సీసీఐకు పంటను అమ్ముకున్నారని అన్నారు. మిగిలిన పంటను కాంగ్రెస్ నేతలు సిండికేట్‌గా ఏర్పడి.. సీసీఐకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీపావళి సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సీసీఐ అధికారులు, ట్రేడర్ల మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఈ కుంభకోణానికి బీజం పడిందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్‌పోర్టు.. బసంత్‌నగర్‌లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and Telugu News