Share News

Harish Rao: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:40 PM

బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్‌ ను ఆపాలని హరీష్‌రావు సవాల్ విసిరారు.

Harish Rao: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.. హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్
Harish Rao

హైదరాబాద్: బీజేపీతో (BJP) బీఆర్ఎస్ (BRS) పొత్తు వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) స్పందించారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని కొందరు అంటున్నారని.. కేసీఆర్ మొన్ననే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ(జూన్2) రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భగా మీడియాతో హరీష్‌రావు మాట్లాడారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకోమని హరీష్‌రావు తేల్చిచెప్పారు.


కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేసి.. వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్‌బుక్‌లో పేర్లు రాసుకుంటామని పోలీస్, ఇతర అధికారులను హెచ్చరించారు. జాగ్రత్త , రాబోయేది తమ ప్రభుత్వమేనని వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ మిల్లీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారనీ వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకే.. పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సమీక్షలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్‌రావు.


చంద్రబాబుకు భయపడి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది బీజేపీనేనని హరీష్‌రావు విమర్శించారు. బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను రూ.12 వేల కోట్లతో నిర్మిస్తున్నారని.. వీటి పనులను నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్‌ను ఆపాలని సవాల్ విసిరారు. బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు ఇప్పటివరకు ఏం చేసిందని ప్రశ్నించారు. బనకచర్ల తెలంగాణకు శాపమని ఆరోపించారు. బనకచర్లను ఆపడంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బనకచర్లను అపుతామని హరీష్‌రావు పేర్కొన్నారు.


బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చి అన్యాయం చేస్తుంది బీజేపీనేనని తెలిపారు. బీజేపీ తెలంగాణాకు ఏం చేసిందని ప్రశ్నించారు. బనకచర్ల తెలంగాణకు శాపమని ఆరోపించారు. బనకచర్లను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా బనకచర్లను అపుతామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మావోయిస్టులపై మారణహోమం ఆపాలి

జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 02 , 2025 | 01:14 PM