Vinod Kumar:అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు
ABN , Publish Date - Feb 11 , 2025 | 02:15 PM
Vinod Kumar: కులగణన నుంచి తప్పించుకోవటానికే మోదీ.. జనగణన చేయటంలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తప్పిదాలున్నాయని చెప్పారు. గతంలో కూడా బీఆర్ఎస్ పోటీ చేయని సందర్భాలు ఉన్నాయని అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ నేతలం నిరాశ, నిస్పృహలో ఉన్నామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ఉన్న మాటే చెబుతున్నానుని.. దీనిలో దాపరికం ఏమీ లేదని చెప్పారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియాతో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం లేదని చెప్పారు. ఓటరు నమోదు కార్యక్రమంలో తాము పాల్గొనలేదన్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తప్పిదాలున్నాయన్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పోటీ చేయని సందర్భాలు ఉన్నాయని అన్నారు.
మోదీ సర్కార్ వెంటనే దేశంలో జనాభా లెక్కింపు జరపాలని డిమాండ్ చేశారు. కులగణన నుంచి తప్పించుకోవటానికే మోదీ.. జనగణన చేయటంలేదని విమర్శించారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు నుంచి తప్పించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. డీ లిమిటేషన్ జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పారు. 2026లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని విభజన చట్టంలో ఉందని చెప్పుకొచ్చారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్ ప్రభావం వల్ల వాయిదా పడ్డాయన్నారు. గుడ్డి ఎద్దు చేనులో పడినట్లు.. మోదీ పాలన చేస్తున్నారని ఆక్షేపించారు. 2011లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. పేదలకు రేషన్ ఇవ్వటం ఇష్టంలేకనే జనాభా లెక్కలకు వెనకడుగు వేస్తున్నారని తెలిపారు. జనాభా లెక్కింపు జరిపితే కొత్తగా 10కోట్ల మందికి కొత్త రేషన్ కార్డులు వస్తాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..
4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News