Share News

CM Revanth Instructions to Officials: టెండర్స్ పిలవండి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 15 , 2025 | 03:46 PM

వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్స్ పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీధి దీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడంపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Instructions to Officials: టెండర్స్ పిలవండి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
CM Revanth Reddy ON Street Light Policy

హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వీధిదీపాల (Street lights) నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి వెంటనే టెండర్స్ పిలవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ(సోమవారం) బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి. వీధి దీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడంపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.


ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని వీధిదీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలని సూచించారు. గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను గ్రామ పంచాయతీకి అప్పగించాలని మార్గనిర్దేశం చేశారు.


వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్‌లకే అప్పగించాలని.. ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలని, అలాగే ప్రతి పోల్ సర్వే చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు..


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 04:35 PM