Share News

BRS MLAs Protest in Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన.. ఎందుకంటే..

ABN , Publish Date - Aug 31 , 2025 | 09:25 PM

కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

BRS MLAs Protest in  Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన.. ఎందుకంటే..
BRS MLAs Protest in Telangana Assembly

హైదరాబాద్, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Report) ఇవాళ(ఆదివారం) తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు (Harish Rao) మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం రిపోర్ట్‌పై హరీష్‌రావు మాట్లాడుతుంటే.. కాంగ్రెస్ మంత్రులు 20సార్లు‌ అడ్డుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.


హరీష్‌రావు గంట 15నిమిషాలు మాట్లాడారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. సంఖ్యా బలం ప్రకారం బీఆర్ఎస్‌కు 32 నిమిషాలే వస్తోందని స్పీకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. హరీష్‌రావు సభను శాసించాలనుకుంటే కుదరదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.


అసెంబ్లీ స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అంతకుముందు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. స్పీకర్ వద్ద పలు విషయాలను ప్రస్తావించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది సభ్యులు మాట్లాడితే.. తమకు అవకాశం కల్పించాలని కోరారు. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ప్రోటోకాల్ ఇబ్బందులను స్పీకర్ దృష్టికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకువచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

For More TG News And Telugu News

Updated Date - Aug 31 , 2025 | 10:01 PM