Bandi Sanjay On Maoists: దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే ఊరుకోం.. బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 19 , 2025 | 01:37 PM
దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం (Central Govt) నుంచి తప్పించుకోలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) హెచ్చరించారు. దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. ఇవాళ(ఆదివారం) సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు బండి సంజయ్. రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లే వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా.. ఇదే తమ హెచ్చరిక అని పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్.
సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోవాలని.. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతోందని వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (AmitShah) మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదని చెప్పుకొచ్చారు. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్‌వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయని స్పష్టం చేశారు. వీరిపై కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయని తెలిపారు. తప్పువైపు నిలబడే వారెవరైనా సరే… పడిపోక తప్పదని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత
టీటీడీ ట్రస్టులో బంజారాలకు అవకాశం కల్పించాలి: ఎంపీ ఈటల రాజేందర్
Read Latest Telangana News and National News