Kavitha On Tirumala : తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత
ABN , Publish Date - Oct 19 , 2025 | 07:38 AM
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.
తిరుమల,అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha), అనిత దంపతులు ఇవాళ(ఆదివారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
కవితని ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు. ఆమెకి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో కవిత మాట్లాడారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం చేసుకుంటానని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని సంకల్పించానని వివరించారు కవిత.
తాను చేపట్టిన యాత్రని స్వామివారికి విన్నవించుకునేందుకు తిరుమల ఆలయానికి వచ్చానని వెల్లడించారు. నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని వచ్చానని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని.. బాగుండాలని వేంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని కవిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో మహారాష్ట్రకు సీఎం రేవంత్‌రెడ్డి!
పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం
Read Latest Telangana News and National News