Share News

Minister Seethakka: పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , Publish Date - Oct 19 , 2025 | 03:49 AM

పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో...

Minister Seethakka: పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ పంచాయత్‌ సెక్రటరీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధులు శనివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా.. గతంలో తమకు రూ.104 కోట్ల బిల్లులు విడుదల చేయించడం, డిప్యూటేషన్‌లకు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఏ. శ్రీకాంత్‌ గౌడ్‌, కోశాధికారి ఎం. శశిధర్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 03:49 AM