Anjan Kumar Yadav ON Jubilee Hills Election: మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:49 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా అని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్‌కుమార్ యాదవ్ నిలదీశారు.
హైదరాబాద్, అక్టోబరు10(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ (Jubilee Hills Election Ticket) కేటాయించకపోవడంపై మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత అంజన్‌కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెబుతానని షాకింగ్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీకి తాను అర్హుడిని కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది ఎవరూ..? అని నిలదీశారు అంజన్ కుమార్ యాదవ్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా..? అని ఫైర్ అయ్యారు. లోకల్, నాన్ లోకల్ సమస్య ఇప్పుడే ఎందుకొచ్చింది..? అని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా..? అని నిలదీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడైనా పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు అంజన్‌కుమార్ యాదవ్.
అయితే, జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నామినేషన్‌కి సిద్ధం అయ్యారు అంజన్ కుమార్. బుజ్జగింపుల పర్వంలో భాగంగా ఆయనని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి వివేక్ వెంకటస్వామి, పలువురు నేతలు కలిశారు. ఈ క్రమంలో అంజన్ కుమార్‌తో నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లాలాగూడలో వాలీబాల్ కోచ్ వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News and National News