Hyderabad Rain: హైదరాబాద్ సిటీని ముంచెత్తిన వర్షం.. ప్రజలు రోడ్లపైకి రావొద్దని హైడ్రా హెచ్చరికలు..
ABN , Publish Date - Aug 07 , 2025 | 07:19 PM
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడం ప్రజల బయటకు రాకూడదని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్: హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా వెల్లడించింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
For More Telangana News And Telugu News