Share News

Jasprit Bumrah Absence Impact: బుమ్రా లేకుండా భారత్ గెలుస్తుందా.. ఇంగ్లండ్ మాజీ స్టార్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Aug 07 , 2025 | 07:06 PM

స్టార్ పేసర్ బుమ్రా లేని పరిస్థితుల్లోనూ టీమిండియా టెస్టుల్లో మరోసారి తన బలాన్ని నిరూపించుకుంది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ బుమ్రా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Jasprit Bumrah Absence Impact: బుమ్రా లేకుండా భారత్ గెలుస్తుందా.. ఇంగ్లండ్ మాజీ స్టార్ ఏమన్నారంటే..
Jasprit Bumrah Absence Impact

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ 2-2తో సమంగా ముగిసింది. ఈ క్రమంలో ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో భారత విజయం సాధించింది. కానీ బుమ్రా లేని మ్యాచ్‌ల్లో భారత్ గెలవడం చిన్న విషయం మాత్రం కాదు. ప్రధానంగా సిరాజ్, ప్రసిద్ధ్‌ల బౌలింగ్‌తో ప్రత్యర్థి తడబడ్డాడు. చివరి రోజు కీలకంగా నిలిచిన ఈ ఇద్దరూ మ్యాచ్‌ను భారత్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో భారత్ టెస్టుల్లో బుమ్రా లేకుండా కూడా విజయం సాధించగలదని స్పష్టం అయింది. దీనిపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


బుమ్రాను తప్పించాలని

ఆయన మాటల్లో చెప్పాలంటే శుభ్‌మన్ గిల్‌కి ఇది గొప్ప విజయమన్నారు. బుమ్రా లేని పరిస్థితుల్లోనూ టెస్టు మ్యాచ్‌లు గెలిపించగలడని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్‌ని మిస్ అయినా, గెలవగలమన్న నమ్మకం ఇప్పుడు భారత జట్టులో ఉందని, ఇది గిల్ కెప్టెన్సీకి పెద్ద అడుగు అని పేర్కొన్నారు.

ఇంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పనేసర్ ఏకంగా బుమ్రాను హోమ్ టెస్టుల నుంచి తప్పించాలని సూచించారు. ఇండియాలో టెస్టులు గెలవడానికి బుమ్రా అవసరం లేదని, భారత జట్టు ఏ దేశంలో అయినా గెలవగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ విదేశీ టూర్లలో మాత్రం అతను కీలకమని, హోమ్ టెస్టుల కోసం తక్కువగా ఉపయోగించి, అతని ఫిట్‌నెస్‌కు ప్రధాన్యత ఇవ్వాలని సూచించారు.


ఫిట్‌నెస్ విషయంలో..

ఇదే సమయంలో మోహమ్మద్ సిరాజ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పుడు భారత్‌కి సిరాజ్ ప్రధాన బౌలర్ అని, అతనిపై ఆధారపడే సమయం వచ్చిందన్నారు. బుమ్రా ఐదు టెస్టుల సిరీస్‌ను పూర్తి చేయడం కష్టమే, కానీ సిరాజ్ ఫిట్‌నెస్ మెరుగ్గా ఉందన్నారు. బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అతను ఐదు టెస్ట్‌లు ఆడలేకపోవచ్చన్నారు.

కానీ సిరాజ్ ఫిట్‌నెస్, బౌలింగ్ సత్తాతో విదేశీ సిరీస్‌లలో గెలుపు తీసుకొచ్చే కీలక ఆటగాడిగా మారాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ లాంటి వాళ్లకు సిరాజ్ ఇప్పుడు విదేశీ టెస్ట్‌లలో కీలక ఆటగాడని మారారని పనేసర్ అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 07:10 PM