Kadapa: జెడ్పీటీసీ ఉప ఎన్నికలు.. పులివెందుల చుట్టూ చెక్‌పోస్టులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 06:45 PM
పార్టీల అభ్యర్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ మురళి నాయక్ సూచించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్ల నల్లగొండ వారి పల్లెలో ఘర్షణ జరిగిందని గుర్తు చేశారు.
కడప: జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల చుట్టూ మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ బి.మురళి నాయక్ తెలిపారు. గ్రామాల పరిదిలో మరో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటిస్తున్నట్లు చెప్పారు. పార్టీల అభ్యర్థుల ప్రచారంలో పోలీసు భద్రత కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
పార్టీల అభ్యర్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని మురళి నాయక్ సూచించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వల్ల నల్లగొండ వారి పల్లెలో ఘర్షణ జరిగిందని గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్త ధనుంజయ ఫిర్యాదుతో వైసీపీ నేతలు రామలింగారెడ్డి, హేమాద్రి రెడ్డితో మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే.. రామలింగారెడ్డి ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించినందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, చిన్నప్ప, బయపురెడ్డి, ఎంపి పీఏ రాఘవరెడ్డితో పాటు మరో 150 మందిపై కేసులు నమోదు చేసినట్లు మురళీ నాయక్ వెల్లడించారు.