Share News

Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. స్పీడ్ పెంచిన పార్టీలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 07:19 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం శనివారం నుంచి హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.

Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. స్పీడ్ పెంచిన పార్టీలు
Jubilee Hills Bye Election

హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bye Election) ప్రచారం రేపటి(శనివారం) నుంచి హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సిద్ధమవుతున్నారు. ఏడు డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రచారం చేయాలని కాంగ్రెస్ (Congress) హై కమాండ్ ఆదేశించింది.


ఎన్నికల ప్రచారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలకి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార బాధ్యతలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు కీలక నేతలకు అప్పగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నిన్న (గురువారం) ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆ పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో రేపటి(శనివారం) నుంచి నంది‌నగర్‌లోనే కేసీఆర్ ఉండి ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించనున్నట్లు సమాచారం. ఎన్నికలు అయ్యే వరకు నంది‌నగర్‌లోనే ఉండాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షించనున్నారు కేసీఆర్. అలాగే, ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది టీబీజేపీ. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ ప్రచారానికి ఉత్తరప్రదేశ్ , గోవా రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

అంగ‌న్వాడీ సరకుల సరఫరాలో అలసత్వం వహిస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి: మంత్రి సీతక్క వార్నింగ్

బస్సు ప్రమాదంపై కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు.. నంబర్లివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 08:09 PM