Local Body Elections: ఓటర్ల మద్దతు కోసం దేనికైనా సిద్ధమంటున్న అభ్యర్థులు
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:18 AM
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదేలేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రయ త్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్ని కలను తలపిస్తున్నాయి. మంగళవారంతో తొలివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మరో 24 గంటల్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలి విడత కింద 6 మండలాల పరిధిలో 166 గ్రామ పంచాయతీలు, 1390 వార్డు మెంబర్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటర్ల మద్దతు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
» సొంతంగా మేనిఫెస్టోలను రూపొందిస్తూ.. ప్రచారం
» ఒప్పంద పత్రాలు, బాండ్ పేపర్లను రాసి ఇస్తున్న వైనం
» వివిధ రకాల ప్రలోభాలతో ఓటర్లకు ఎర
» ప్రశాంతంగా ముగిసిన తొలివిడత ఎన్నికల ప్రచారం
ఆదిలాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు దేనికైనా తగ్గేదే లేదంటున్నారు. అప్పులు చేసి మరీ ఎన్నికల్లో నెగ్గేందుకు సిద్ధమవుతున్నారు. తొలివిడత ఎన్నికలు జరగే గ్రామాల్లో అభ్యర్థులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతుతో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఊరిని బాగు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అయితే గత పక్షం రోజులుగా సాగిన మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో ప్రశాంతంగా ముగిసింది.
స్థానిక సమస్యలఫై ఫోకస్
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మురుగునీటి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, అసంపూర్తిగా ఉన్న ఆలయాలు, కుల సంఘ భవనాల నిర్మాణం పనులపై హామీలు ఇస్తున్నారు. అలాగే తమను గెలిపిస్తే గ్రామాల్లో చేపట్టే పనులకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో జోరుగా వైరల్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.
కొన్ని గ్రామాల్లోనైతే గెలిచిన తర్వాత చేపట్టే పనులపై ఏకంగా మేనిఫె స్టోలనే తయారు చేస్తూ ప్రకటిస్తున్నారు. ఓటర్లను నమ్మించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీల మద్దతుతో అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తున్నారు. మరికొందరు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పల్లెలను బాగు చేస్తామని, అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
Read Latest Telangana News and National News