Share News

Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డ్..

ABN , Publish Date - Oct 13 , 2025 | 05:41 PM

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డ్‌ నమోదు చేశాడు. 13 ఏళ్ల తర్వాత ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి బ్యాటింగ్‌కు దిగిన తొలి కెప్టెన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టు మ్యాచ్‌లో ముందుగా ..

Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డ్..
Shubman Gill

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డ్‌ నమోదు చేశాడు. 13 ఏళ్ల తర్వాత ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి బ్యాటింగ్‌కు దిగిన తొలి కెప్టెన్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఢిల్లీ టెస్టు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 270 పరుగుల ఆధిక్యం లభించింది. వెంటనే వెస్టిండీస్‌ను ఫాలో ఆన్ ఆడించిన శుభ్‌మన్ గిల్ ఆ జట్టు నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.


రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్(West Indies) బ్యాటర్లు ఔట్ చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. తొలి ఇన్నింగ్స్ లో ఔట్ చేసినంత ఈజీగా రెండో ఇన్నింగ్స్ లో విండీస్ బ్యాటర్లను భారత్ బౌలర్లు పెవిలియన్ పంపలేక పోయారు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో ఈ పరిస్థితి ఎదురైంది. జాన్ కాంప్‌బెల్(115), షైహోప్(103) సెంచరీలతో రాణించడంతో 390 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ అయింది.

దీంతో భారత్(India) ముందు 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ నిర్ధేశించింది. అయితే 270 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో ఇన్నింగ్స్ ఆడుతామని భావించలేదు. ఇన్నింగ్స్ తేడాతో గెలవాలని గిల్ అనుకున్నాడు. కానీ తిరిగి రెండో సారి బ్యాటింగ్ దిగాల్సిన పరిస్థితిని విండీస్ బ్యాటర్లు భారత్ కు కల్పించారు.


చివరిసారిగా 13 ఏళ్ల క్రితం 2012లో ధోని(Dhoni) కెప్టెన్సీలో ఇంగ్లాండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఫాలో ఆన్ ఆడించి నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసింది. అయితే ఇలా ఫాలో ఆన్ ఇచ్చి..భారత్ బ్యాటింగ్ కు దిగడం తొలిసారి 1961లో జరిగింది. ఆ టైమ్ లో పాకిస్థాన్(Pakistan) తో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఫాలో ఆన్ ఆడించి..భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొత్తంగా ధోని తర్వాత ఆ చెత్త రికార్డును గిల్ మూటగట్టుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం భారత్ ఒక వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో రాహుల్(Rahul)(25*), సాయి సుదర్శన్(Sudharsan)(30*) ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 05:41 PM