Share News

West Indies Fight Back in Follow On: ఫాలో ఆన్‌లో కరీబియన్ల అనూహ్య పోరాటం

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:46 AM

ఊదేస్తామనుకొన్న భారత్‌కు.. ఫాలో ఆన్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ కౌంటర్‌ అటాక్‌తో ఎదురు నిలిచింది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (87 బ్యాటింగ్‌), షాయ్‌ హోప్‌ (66 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో..

West Indies Fight Back in Follow On: ఫాలో ఆన్‌లో కరీబియన్ల అనూహ్య పోరాటం

కులదీపునకు ఐదు వికెట్లు

  • విండీస్‌ 173/2

  • తొలి ఇన్నింగ్స్‌లో 248 ఆలౌట్‌

  • భారత్‌తో రెండో టెస్ట్‌

న్యూఢిల్లీ: ఊదేస్తామనుకొన్న భారత్‌కు.. ఫాలో ఆన్‌ ఆడుతున్న వెస్టిండీస్‌ కౌంటర్‌ అటాక్‌తో ఎదురు నిలిచింది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (87 బ్యాటింగ్‌), షాయ్‌ హోప్‌ (66 బ్యాటింగ్‌) అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. విండీస్‌ ఆటను నాలుగో రోజుకు తీసుకెళ్లింది. 97 పరుగుల వెనుకంజలో ఉన్న కరీబియన్లు టీమిండియా ఇన్నింగ్స్‌ విజయాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్‌లో పడిన విండీస్‌.. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 173/2 స్కోరు చేసింది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండడంతో.. భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా సాగుతోంది. ఓపెనర్‌ తేజ్‌నరైన్‌ చందర్‌పాల్‌ (10)ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చగా.. అలిక్‌ అథనజె (7)ను సుందర్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే, మరో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌, హోప్‌ మూడో వికెట్‌కు 138 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో విండీస్‌ తరఫున ఈ ఏడాది అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 140/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విండీస్‌ 248 పరుగులకు కుప్పకూలింది. షాయ్‌ హోప్‌ (36), అండర్సన్‌ ఫిలిప్స్‌ (24 నాటౌట్‌), కేరీ పియర్రీ (23) కొంతసేపు క్రీజులో నిలిచారు. కుల్దీప్‌ ఐదు, జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగకుండా వెస్టిండీ్‌సను ఫాలో ఆన్‌ ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 518/5 వద్ద డిక్లేర్‌ చేసింది.


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 134.2 ఓవర్లలో 518/5 డిక్లేర్‌.

వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (సి) సుదర్శన్‌ (బి) జడేజా 10, చందర్‌పాల్‌ (సి) రాహుల్‌ (బి) జడేజా 34, అథనజె (సి) జడేజా (బి) కుల్దీప్‌ 41, హోప్‌ (బి) కుల్దీప్‌ 36, చేజ్‌ (సి అండ్‌ బి) జడేజా 0, టెవిన్‌ ఇమ్లాచ్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 21, గ్రీవ్స్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 17, కరీ పైర్రీ 23, వారికన్‌ (బి) సిరాజ్‌ 1, ఫిలిప్స్‌ (నాటౌట్‌) 24, జేడెన్‌ సీల్స్‌ (ఎల్బీ) కుల్దీప్‌ 13; ఎక్స్‌ట్రాలు: 28; మొత్తం: 81.5 ఓవర్లలో 248 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-21, 2-87, 3-106, 4-107, 5-156, 6-163, 7-174, 8-175, 9-221, 10-248; బౌలింగ్‌: బుమ్రా 14-4-40-1, సిరాజ్‌ 9-2-16-1, జడేజా 19-5-46-3, కుల్దీప్‌ యాదవ్‌ 26.5-4-82-5, సుందర్‌ 13-2-41-0.

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (బ్యాటింగ్‌) 87, చందర్‌పాల్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 10, అథనజె (బి) సుందర్‌ 7, హోప్‌ (బ్యాటింగ్‌) 66; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 49 ఓవర్లలో 173/2; వికెట్ల పతనం: 1-17, 2-35; బౌలింగ్‌: సిరాజ్‌ 6-2-10-1, జడేజా 14-3-52-0, సుందర్‌ 13-3-44-1, కుల్దీప్‌ 11-0-53-0, బుమ్రా 4-2-9-0, జైస్వాల్‌ 1-0-3-0.

1

చేజ్‌-హోల్డర్‌ తర్వాత భారత్‌తో టెస్ట్‌లో ఒక పూర్తి సెషన్‌ బ్యాటింగ్‌ చేసిన జంటగా క్యాంప్‌బెల్‌-హోప్‌. 2016లో కింగ్‌స్టన్‌లో జరిగిన టెస్ట్‌లో ఐదో రోజు ఆఖరి సెషన్‌లో 19 ఓవర్లపాటు క్రీజులో నిలిచిన ఛేజ్‌-హోల్టర్‌ విండీ్‌సను డ్రాతో గట్టెక్కించారు.

1

భారత పర్యటనలో గత మూడు ద్వైపాక్షిక సిరీ్‌సల్లో.. ఆడిన ఆరు టెస్ట్‌ల్లో ఒక మ్యాచ్‌ను వెస్టిండీస్‌ నాలుగో రోజుకు తీసుకెళ్లడం ఇదే తొలిసారి.


000-Sports.jpg

లిప్‌బామ్‌

ఫ్రెండ్లీ గొడవ..

ఎటువంటి మ్యాచ్‌ ఒత్తిడీ లేకపోవడంతో ఫీల్డింగ్‌ చేస్తున్న భారత ఆటాగాళ్లు ఎంతో సరదాగా కనిపించారు. జడేజా జోకులు పేలుస్తుంటే.. కుల్దీప్‌ వికెట్‌ పడగొట్టినప్పడల్లా జైస్వాల్‌.. గిల్‌తో సంబరాలు చేసుకొన్నాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రాహుల్‌.. జేబులోంచి లిప్‌బామ్‌ తీసుకొని రాసుకొన్నాడు. కొంచెం ఆవలగా నిలబడిన గిల్‌.. రాహుల్‌ వద్దకు వచ్చి ఏదో అనడంతో రాహుల్‌ కూడా సరదాగా తిరిగి కౌంటర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ సీన్‌ అభిమానుల దృష్టిలో పడడంతో.. నెట్‌లో వైరల్‌ అయింది.

జేడెన్‌ సీల్స్‌కు

జరిమానా

క్రమశిక్షణను ఉల్లంఘించిన విండీస్‌ పేసర్‌ సీల్స్‌ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోతతోపాటు ఓ డిమెరిట్‌ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చారు. భారత తొలి ఇన్నింగ్స్‌ 29వ ఓవర్‌లో తన బౌలింగ్‌లోనే బంతిని ఆపిన సీల్స్‌.. బ్యాటర్‌ జైస్వాల్‌వైపు విసిరేశాడు. అయితే, బంతి జైస్వాల్‌ ప్యాడ్‌లకు బలంగా తాకింది. దీంతో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లో ఆర్టికల్‌ 2.9 కింద అతడిపై మ్యాచ్‌ రెఫరీ చర్యలు తీసుకొన్నాడు.

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:46 AM