Taj Mahal Complex Fire: తాజ్ మహల్ కాంప్లెక్స్ వద్ద అగ్నిప్రమాదం
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:22 PM
తాజ్ మహల్ సదరన్ గేట్ సమీపంలోని ఛాంబర్స్ మీదుగా వెళ్లే ఎలక్ట్రిక్ లైన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని ఏఎస్ఐ అధికారులు, టోరెంట్ పవర్ అధికారులకు తెలియజేశారు.
ఆగ్రా: ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్ మహల్ (Taj Mahal) క్లాంప్లెక్ దక్షిణ ద్వారం వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన డోమ్‌కు 300 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కట్టడం దక్షిణ ద్వారం వద్ద దట్టమైన నల్లటి పొగలు ఎగసిపడటంపై స్థానికులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే మంటలను వెంటనే అదుపులోకి తెచ్చారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నప్పటికీ సోమవారం నాడు ఇది వెలుగుచూసింది. సదరన్ గేట్ సమీపంలోని ఛాంబర్స్ మీదుగా వెళ్లే ఎలక్ట్రిక్ లైన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని ఏఎస్ఐ అధికారులు, టోరెంట్ పవర్ అధికారులకు తెలియజేశారు. దీంతో టోరెంట్ టెక్నికల్ టీమ్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఎలక్ట్రిక్ లైన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. రెండు గంటల సేపు విద్యుత్ సరఫరాను నిలివేసి రిపేర్ వర్క్ చేపట్టారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తాజ్ కట్టడానికి ఎలాంటి నష్టం జరగలేదని పూర్తి సురక్షితంగా ఉందని అధికారులు ధ్రువీకరించారు. కాగా, 2018 నుంచి తాజ్ మహల్ దక్షిణ ద్వారం నుంచి ప్రయాణికుల ఎంట్రీని అనుమతించడం లేదు.
ఇవి కూాడ చదవండి..
రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి