Accident Viral Video: ఈ పెద్దాయన ఎలా చనిపోయాడో చూస్తే.. అయ్యో పాపం అంటారు..
ABN , Publish Date - Sep 04 , 2025 | 09:54 PM
పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని జవ్హార్కే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగ్జీవన్ (60) అనే రైతు స్థానిక ప్రాంతంలో వీధి గుండా సైకిల్‌పై వెళ్తున్నాడు. అయితే ఓ వీధిలోకి రాగానే ఉన్నట్టుడి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరూ చెప్పలేరు. కొందరు చావు అంచుల దాకా వెళ్లి ఆశ్చర్యకరంగా ప్రాణాలతో బయటపడుతుంటారు. అలాగే మరికొందరు అప్పటిదాకా బాగుండి.. అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇంకొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సైకిల్‌పై వెళ్తున్న పెద్దాయన ఎలా చనిపోయాడో చూసి అంతా.. అయ్యో పాపం.. అంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని (Punjab) మాన్సా జిల్లాలోని జవ్హార్కే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగ్జీవన్ (60) అనే రైతు స్థానిక ప్రాంతంలో వీధి గుండా సైకిల్‌పై వెళ్తున్నాడు. అయితే ఓ వీధిలోకి రాగానే ఉన్నట్టుడి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది.
మార్గ మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉండడంతో ఆ వ్యక్తి సైకిల్‌ను స్లో చేశాడు. అయితే తీరా స్పీడ్ బ్రేకర్స్ వద్దకు రాగానే పక్కనే ఉన్న పెద్ద గోడ కూలిపోతుంది. గోడ కూలడం గమనించిన ఆ వ్యక్తి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే గోడ కూలి మీద పడిపోతుంది. ఈ ఘటనలో అతను (wall collapsed and fell on old woman) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరూ చెప్పలేరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 400కి పైగా లైక్‌లు, 39 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
వీడెవడండీ బాబూ.. పామును మెడలో దండలా వేసుకుని మరీ..
అరెరే.. ఈమెకు పెద్ద కష్టమే వచ్చిందిగా.. స్కూటీని బయటికి తీయబోయి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి