Share News

Elephant Viral Video: ఈ ఏనుగు హెయిర్ స్టైల్ మామూలుగా లేదుగా.. ఎలా సెట్ చేసిందో చూస్తే..

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:52 PM

అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఏనుగు.. సడన్‌గా చెట్టు వద్ద ఆగింది. గడ్డి తింటుందేమో అనుకుంటే.. చివరకు అంతా షాక్‌ అయ్యేలా చేసింది. తొండంతో పచ్చ గడ్డిని తీసుకుంది. ఆ గడ్డిని తింటుందేమో అని అంతా అనుకున్నారు. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Elephant Viral Video: ఈ ఏనుగు హెయిర్ స్టైల్ మామూలుగా లేదుగా.. ఎలా సెట్ చేసిందో చూస్తే..

ఏనుగు అంటేనే గంభీరానికి నిదర్శనం. కామ్‌గా కనిపించే ఏనుగులు కొన్నిసార్లు బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే మరికొన్నిసార్లు మనుషులకు సాయం చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తు్ంటాయి. అయితే ఏనుగు ఎప్పుడైనా స్లైల్‌గా స్టంట్స్ చేయడం చూశారా.. సర్కస్‌లో ఏనుగులు విన్యాసాలు చేయడం సర్వసాధారణం. కానీ అడవిలో కనిపించే ఏనుగులు.. ఏమాత్రం వినూత్నంగా వ్యవహరించినా.. ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. ఇలాంటి వీడియోలను నెట్టింట నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ ఏనుగు హెయిర్ స్టైల్ సెట్ చేసుకున్న విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఏనుగు (Elephant).. సడన్‌గా చెట్టు వద్ద ఆగింది. గడ్డి తింటుందేమో అనుకుంటే.. చివరకు అంతా షాక్‌ అయ్యేలా చేసింది. తొండంతో పచ్చ గడ్డిని తీసుకుంది. ఆ గడ్డిని తింటుందేమో అని అంతా అనుకున్నారు.


కానీ ఆశ్చర్యకరంగా ఆ గడ్డిని.. తల మీద టోపీలాగా పెట్టుకుంది. అది కూడా ఎంతో స్టైల్‌గా అలా విసిరేయడంతో.. (Elephant Put Grass on its Head Like Hat) ఆ గడ్డి నేరుగా వెళ్లి తల ముందు భాగంలో టోపీలాగా పడింది. చూసేందుకు ఇది స్టైలిష్ హెయిర్‌లా మారిపోయింది. ఇలా రెండు సార్లు ఆ ఏనుగు గడ్డిని తన తల మీద వేసుకుంది. ఏనుగు వింత నిర్వాకం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్కారు. మరికొందరు తెగ నవ్వుకున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏనుగు హెయిర్ స్టైల్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇది కదా అసలు సిసలు హెయిర్‌స్టైల్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా లైక్‌లు, 1.47 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

హెల్మెట్ గ్లాస్‌పై పొగమంచు పడుతోందా.. ఇతను చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 31 , 2025 | 05:03 PM