Car Accident Viral Video: కారు సన్ రూఫ్‌పై ఇలా చేస్తున్నారా.. ఈ పిల్లాడికి ఏమైందో చూడండి..
ABN , Publish Date - Sep 07 , 2025 | 07:50 PM
సాధారణంగా ప్రస్తుతం కారు కొనేవారంతా సన్‌రూఫ్ ఉన్న వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సన్‌రూఫ్‌పై నిలబడి ప్రయాణించడం కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు. ఈ వీడియోనే అందుకు నిదర్శనం. కారు సన్‌రూఫ్‌పై నిలబడ్డ పిల్లాడి పరిస్థితి ఏమైందో చూడండి..
కారులో రయ్యిన దూసుకెళ్తే ఎలా ఉంటుంది.. అందులోనూ కారు సన్ రూఫ్‌పై నిలబడి వెళ్తుంటే ఇంకెలా ఉంటుందీ అని అడిగితే.. ఆ అనుభూతే వేరుగా ఉంటుందనే సమాధానం వస్తుంది. వింత అనుభూతి కలిగే మాట నిజమో కాదో తెలీదు కానీ.. అజాగ్రత్తగా ఉంటే మాత్రం అదే మీ ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే.. ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కారు సన్ రూఫ్‌పై నిలబడిన పిల్లాడి పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రస్తుతం కారు కొనేవారంతా సన్‌రూఫ్ ఉన్న వాహనాలు (Sunroof car) కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సన్‌రూఫ్‌పై నిలబడి ప్రయాణించడం కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది.
బెంగళూరులో జరిగినట్లుగా చెబుతున్న ఈ వీడియోలో రోడ్డుపై వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. ఇంతలో ఓ ఎర్రటి కారు అటుగా వచ్చింది. సన్ రూఫ్ ఉన్న ఆ కారులో (boy standing on car sunroof) ఓ పిల్లాడు తల పైకి పెట్టి నిలబడి ఉన్నాడు. కాస్త దూరంలో రైల్వే క్రాసింగ్ వద్ద ఇనుప స్తంభాల కింద వెళ్లాల్సి ఉంది. కారు నేరుగా ఇనుప రెయిలింగ్ కింద నుంచి దూసుకెళ్లిపోతుంది. ఈ క్రమంలో సన్‌రూఫ్‌పై నిలబడి ఉన్న పిల్లాడి తలకు ఇనుప స్తంభం తగిలి లోపలికి పడిపోయాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లు, 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పూరీలను చేయడంలో.. ఈమె ట్రిక్ చూస్తే మతి పోవాల్సిందే..
అడవి దున్నలా మజాకా.. కంటపడిన పులిని కాసేపటికే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి