Katihar ViralVideo: నోర్ముయ్.. లేకపోతే చెప్పుతో కొడతా!.. మహిళా రోగితో డాక్టర్ దురుసు ప్రవర్తన..
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:56 PM
వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళా రోగితో ఓ డాక్టర్ దారుణంగా ప్రవర్తించాడు. నోర్ముయ్.. లేకపోతే చెప్పుతో కొడతా అంటూ తిట్లదండకం అందుకున్నాడు. అసభ్యకర పదజాలంతో పదిమంది ముందు గూండాలా ప్రవర్తించాడు. ఈ రేంజ్‌లో డాక్టర్ కోపంతో ఎందుకు ఊగిపోయాడో తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.
బిహార్, కటిహార్: ఓ ప్రభుత్వ వైద్యుడు విచక్షణ మరిచి మహిళా రోగితో దారుణంగా ప్రవర్తించాడు. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే బూతు పురాణం విప్పాడు. నోర్ముయ్.. లేకపోతే చెప్పుతో కొడతా అంటూ.. అసభ్యకర పదజాలంతో అవమానకరంగా దూషించాడు. ఈ రేంజ్‌లో డాక్టర్ కోపంతో ఎందుకు ఊగిపోయాడో తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. బిహార్‌లోని కటిహార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. మహిళా పేషెంట్ తో దురుసుగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైద్యుడు ఒక మహిళా రోగితో దురుసుగా ప్రవర్తించిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్యుడు డాక్టర్ సుశాంత్ అని పోలీసులు గుర్తించారు. అతడు ఆసుపత్రి లోపల మహిళా రోగిని నోర్ముయ్.. లేకపోతే చెప్పుతో కొడతా అంటూ.. దూషించడం.. జైలుకు పంపుతానంటూ బెదిరిస్తూ ఉండగా.. ఆమె భర్త దాన్ని కెమెరాలో బంధించారు. ఆస్పత్రిలో గంటల తరబడి కొనసాగిన ఈ హై ఓల్టేజ్ డ్రామా దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
బాధిత మహిళ చెప్పిన దాని ప్రకారం, ఆమె చేతికి గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లింది. అయితే డాక్టర్ ఒక భాగానికి మాత్రమే ఎక్స్-రే తీసుకోవాలని సూచించారు. ఇతర గాయాలను పట్టించుకోలేదు. దీంతో ఆమె వేరే భాగాలకు ఎక్స్-రే చేయమని కోరింది. అంతే, డాక్టర్ ఒక్కసారిగా కోపంతో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దుర్భాషలాడుతూ చెప్పుతో కొడతానని బెదిరించాడు. ఆమె భర్తను జైలుకు పంపుతానని హెచ్చరించాడు. ఈ మొత్తం సంఘటనను మహిళ భర్త మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
వైరల్ వీడియోలో, వైద్యుడు రోగిని బెదిరిస్తున్నట్లు వినవచ్చు. అయితే మహిళనే మొదట తనను దుర్భాషలాడిందని.. ఆ తర్వాతే తాను స్పందించానని డాక్టర్ చెబుతున్నాడు. కానీ, నెటిజన్లు, స్థానికులు డాక్టర్ సుశాంత్ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వైద్యుడు అయ్యుండి ఇలా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు సదరు వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బంది రోగులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన వారి పట్ల ఎలా ప్రవర్తిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఉత్తరాఖండ్ ధరాలి సమీపంలో రెండో జల ఖడ్గ ప్రళయ ఘోష
ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నా: మోదీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి