MLA Komatireddy Rajagopal Reddy : మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చాను : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:51 PM
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడారు.
నల్గొండ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఓ చోట కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు రాజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీపై మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని బాంబు పేల్చారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ఇవాళ(మంగళవారం) మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్‌లోకి వచ్చా అని కుండబద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని తెలిపారు. తనకు మంత్రిపదవి ఇస్తారా.. లేదా అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టమని, అందరిలాగా.. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదని స్పష్టం చేశారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) 2022 ఆగస్టు 2న కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం 2022 ఆగస్టు 21న మునుగోడులో జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీ(BJP)లో చేరారు. రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బీజేపీ నియమించింది. కాగా, ఆయన 2023 అక్టోబరు 25న బీజేపీకి రాజీనామా చేశాడు. తరువాత మళ్లీ అదే సంవత్సరం అక్టోబరు 27న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్