Film Producers Meet Chiranjeevi : చిరంజీవిని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు.. సినీ కార్మికుల వేతనాలపై చర్చ
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:40 PM
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ , మైత్రీ రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఫిలింనగర్ : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం కార్మికుల వేతనాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో సినీ కార్మికులకు నిర్మాతలకు మధ్య వివాదం కొనసాగుతుంది. అయితే నిర్మాతలు వేతనాలు పెంచకపోవడం, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ రద్దు చేయడంతో కార్మికులు బంద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొందరూ నిర్మాతలు మెగస్టార్ చిరంజీవిని కలిశారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ , మైత్రీ రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం. కార్మికుల వేతనాల పెంపు వివాదం, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను నిర్మాతలు చిరంజీవికి వివరించనున్నారు.
తాజాగా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ రద్దుపై అధ్యక్షుడు వల్లభనేని అనిల్ స్పందించారు. కార్మికులు సమాన హక్కులు కోరుతున్నారని, పరిశ్రమలో నైపుణ్యం ఉన్నవారిని పక్కన పెట్టడం సరికాదన్నారు. వేతనాలు అడిగితే కొత్తవారిని తీసుకువస్తామని నిర్మాతలు చెబుతున్నారని.. సినిమాపై ఇంట్రెస్ట్‌తో ఎవరైనా వస్తే వారిని శ్రమ దోపిడి చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం చర్చలతోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నప్పటికీ, అవసరమైతే ఉద్యమ మార్గాన్ని కూడా ఎంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్