Malnadu Restaurant Case : మాల్నాడు రెస్టారెంట్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్..
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:27 PM
రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాల్నాడు రెస్టారెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది.
హైదరాబాద్ : రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాల్నాడు రెస్టారెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు ప్రదర్శిస్తూ.. సంచలన విషయాలను బయటపెడుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఈగల్ టీమ్ ఎస్సీ రూపేష్ తెలిపారు.
ఈగల్ టీం ఎస్పీ రూపేష్(SP Rupeesh) ఇవాళ(మంగళవారం) మీడియాతో మాట్లాడారు.. సందీప్, లోచన్ అనే డ్రగ్ పెడ్లర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు చెప్పారు. కేసులో భాగంగా 7 మంది పబ్ ఓనర్లకి నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. పబ్‌లో లేట్‌నైట్ పార్టీల మీద ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఎవరెవరు వీఐపీ లాంజ్‌లను బుక్ చేసుకున్నారు అనే విషయంపై ఆరా తీసినట్లు చెప్పారు.
ఇప్పటివరకు కేసులో పదిమందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రూపేష్(SP Rupeesh) తెలిపారు. మల్నాడు రెస్టారెంట్ కేసులో మొత్తం 25 మంది నిందితులు ఉన్నారని స్పష్టం చేశారు. నిందితుల్లో నలుగురు నైజీరియన్స్ పరారీలో ఉన్నారని అన్నారు. లోచన్ పూణే నుంచి డ్రగ్స్(Drugs)ను తీసుకొని వచ్చి ఇక్కడి వారికి సప్లై చేసినట్లు గుర్తించామని ఎస్పీ రూపేష్ వెల్లడించారు.
ఈ కేసులో మల్నాడు రెస్టారెంట్స్ యజమాని సూర్య, అతని మిత్రుడు హర్షలను ‘ఈగల్ టీం’ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్ నిర్వాహకులు నైజీరియా యువతి ద్వారా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు బయటపడింది. డ్రగ్స్ సప్లై చేసేందుకు మల్నాడ్ కిచెన్ యజమాని సూర్య నైజీరియా యువతులకు వెయ్యి నుంచి రూ.3వేలు కమిషన్ ఇస్తున్నట్లు ఒప్పుకున్నాడు. మల్నాడు కిచెన్ నుంచి సిటీలోని పలు పబ్స్, హోటల్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు బయటపడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు