Ponguleti Srinivasa Reddy: కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారు..
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:13 PM
రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం రచ్చ నడుస్తోంది. అటు అధికార పార్, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు తగ్గేదేలే అంటూ.. మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడారు.
ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం రచ్చ నడుస్తోంది. అటు అధికార పార్, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు తగ్గేదేలే అంటూ.. మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి కేబినెట్ అనుమతులు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు చెప్పడం పచ్చిబూతు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం విషయంలో ప్రజలను మభ్యపెడతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేం చేశారన్నది జస్టిస్ ఘోష్ నివేదికలో స్పష్టంగా ఉందన్నారు. నివేదికలో ఉన్న అంశాలను అసెంబ్లీతో పాటూ ప్రజల ముందు పెడతామని ఆయన స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం జస్టిస్ ఘోష్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. అసెంబ్లీలో చర్చించమని బీఆర్ఎస్ నేతల డిమాండ్ చేస్తున్నారన్నారు. వారి కంటే ముందే.. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అసెంబ్లీలో కాళేశ్వరం(Kaleshwaram) చర్చను ప్రకటించారని పేర్కొన్నారు.
అసెంబ్లీలో కాళేశ్వరంపై (Kaleshwaram) చర్చ పెడితే.. బీఆర్ఎస్(BRS) నాయకులు ఉతికారేస్తామంటున్నారు.. ఏం ఉతికికారేస్తారు బట్టలా అని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. మామ, అల్లుడు కూర్చొని పిల్లర్లను సరిచేస్తారా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల మాటలు విని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని వాస్తవాలను గ్రహిస్తే మంచిదని మంత్రి పొంగులేటి హితవు పలికారు.
అయితే.. కాళేశ్వరం కమిషన్ నివేదికపై(Kaleshwaram Commission Report) మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై పూర్తి ఆధారాలతో హరీష్‌రావు బ్రీఫింగ్ చేశారు. హరీష్‌రావు ప్రెజెంటేషన్ చూసేలా బీఆర్ఎస్ నేతలు జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాప్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యతను మాత్రమే కేసీఆర్ నిర్వర్తించారని... రాజకీయ జోక్యం ఎలా అవుతోందని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను హింసించాలనే ధోరణి తప్ప.. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజా సమస్యలు పట్టడం లేదని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు
For More AP News and Telugu News