Home » Producer
సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్‌కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.
సినీ కార్మికులకు 30శాతం వేతనాలు పెంచి, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు మీడియాకు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహించారు. తాను కార్మికుల సంఘాల నుంచి ఎవరినీ కలవలేదని ఆయన స్పష్టం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ , మైత్రీ రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
నకిలీ పత్రాలు సృష్టించి, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కేసులో ప్రముఖ సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను ఓయూ పోలీసులు అరెస్టు చేశారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’, ‘లంచ్ బాక్స్’, ‘ఎలిఫెంట్ విష్పరర్స్’, ‘కిల్’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్ మోంగా కపూర్. వాటిలో ‘ఎలిఫెంట్ విష్పరర్స్’... గత ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్ సిరీస్ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
తెలుగు సినీ చరిత్రలో వైజయంతి మూవీస్ బ్యానర్‌కు, దాని అధినేత అశ్వనీదత్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల చలన చిత్ర ప్రస్థానం కలిగిన ఈ బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రికార్డులు సృష్టిస్తోంది. ‘‘ఈ బ్యానర్‌లో నా తొలి సినిమాకు అయిన ఖర్చు 15 లక్షలు. కల్కికి అయిన ఖర్చు
64 కళల్లో చోరకళ కూడా ఒకటి అంటారు. అయితే కనీసం ఒంటికి తెలియకుండా ఒంటి మీదున్నవన్నీ వలిచేయడం చోరకళలో ప్రావీణ్యం సాధించిన వారికే తెలిసి ఉంటుందేమో.. తాజాగా ఓ సినీ నిర్మాత ఒంటిపై బట్టలు మినహా మొత్తం వలిచేసుకుని వెళ్లిపోయాడో దొంగ. ఇప్పుడు ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.