Filmnagar: సినీ కార్మికుల వేతనాల పెంపుపై .. టాలీవుడ్ నిర్మాతల రియాక్షన్
ABN , Publish Date - Aug 11 , 2025 | 06:14 PM
సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్‌కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.
ఫిలింనగర్: సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం రోజుకో కొత్త టాపిక్‌తో వార్తల్లో నిలుస్తుంది. కార్మికుల సమస్య పరిష్కారం అవుతుందో లేదో అనే దానిపై.. అటూ టాలీవుడ్‌లోనే కాకుండా.. ఇటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై తాజాగా టాలీవుడ్ నిర్మాతలు స్పందించారు. ఇవాళ(సోమవారం) మీడియాతో వారి భావనను వ్యక్త పరుచుకున్నారు.
పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారు : నిర్మాత ఎస్‌కెఎన్
సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్‌కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు సినిమాలకు సరైన బిజినెస్ అవటం లేదని తెలిపారు. అయినా 2000 లోపు వేతనాలు తీసుకునే కార్మికులకు పెంచుతామన్నట్లు గుర్తు చేశారు. టికెట్ రేట్ల పెంపు పెద్ద సినిమాలకే.. ఏడాదికి అలాంటివి పది మాత్రమే వస్తాయని వివరించారు. మిగతావి 200 సినిమాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చిన్న సినిమాలకు టికెట్ రేట్లు వర్తించవని తెలిపారు. ఇండస్ట్రీలో నలిగిపోతున్న నిర్మాత పక్కన ఎవరు నిలబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్ట్ కేసులు ఉన్నవారికి కార్మిక నాయకులుగా ఉండే ఆర్హత లేదని ఆరోపించారు. ఇండస్ట్రీ బాగుంటేనే అందరు బాగుంటారని ఎస్‌కెఎన్ సూచించారు.
నిర్మాతలకు పట్టించుకోవాలి: నిర్మాత రాజేష్ దండ
నిర్మాతలకు రావాల్సిన పెమెంట్స్ పెండింగ్‌లో ఉంటాయి.. కానీ కార్మికుల వేతనాలు ఏరోజుకారోజే ఇవ్వాలని నిర్మాత రాజేష్ దండ చెప్పుకొచ్చారు. తన గత సినిమాకు 250 వర్కర్స్ రావాల్సి ఉంటే.. అంత మంది వర్కర్స్ రాలేదని తెలిపారు. ఆ సమయంలో ఫెడరేషన్ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. యూనియన్ లీడర్స్ కూడా నిర్మాతల గురించి పట్టించుకోవాలని సూచించారు.
యూనియన్ రూల్స్ వల్ల నిర్మాతలకు నష్టం: నిర్మాత మధుర శ్రీధర్
సినిమాలో పని ఉండేది నలుగురికే అయితే.. 80 మంది ఉంటారని నిర్మాత మధుర శ్రీధర్ ఆరోపించారు. యూనియన్ రూల్స్ వల్ల నిర్మాతలకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమా కథను 50 లక్షల్లో చెప్పాలనుకుంటే.. ఇలాంటి ఘటనల వల్ల రెండు కోట్లు ఖర్చు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. నిర్మాతల నెత్తిన ఎందుకు ఇంతమందిని రుద్దుతున్నారని ఆయన ప్రశ్నించారు.
వేతనాల పెంపు నిర్మాతకు భారమే.. : నిర్మాత చైతన్య రెడ్డి
కార్మికులను తమకు నచ్చిన వారిని ఎందుకు పెట్టుకొకూడదని నిర్మాత చైతన్య రెడ్డి ప్రశ్నించారు. సినీ ఎంప్లాయిస్‌కు నిర్మాతలు పని కల్పిస్తున్నారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో వేతనపెంపు భారమే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాపారం సరిగ్గా నడవటం లేదన్నారు. పరిస్దితులకు తగ్గట్టుగా సర్దుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏ నిర్మాత సినిమాల వల్ల డబ్బులు సంపాదించటం లేదని పేర్కొన్నారు. ఎవరు హ్యాపీగా ప్రాఫిట్స్‌లో లేరని.. కేవలం సినిమా మీద ప్యాషన్‌తో సినిమాలు చెస్తున్నామని స్పష్టం చేశారు. కోవిడ్ అనంతరం కార్మికులకు హైక్ అడిగితే ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితిని కార్మికులందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!
కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది