EPF Grievance: పిఎఫ్ ఖాతాలో సమస్య ఉందా? ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి..
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:05 PM
ఉద్యోగులు PF ఖాతాకు సంబంధించి ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. పిఎఫ్ అకౌంట్లో ఏ సమస్యల వచ్చినా ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలి? అనే ప్రతిదీ ఇక్కడ తెలుసుకోండి..
How to Complain about PF issues: పిఎఫ్ ఖాతాలో ప్రతి నెలా మీ జీతం నుంచి కట్ అయినా డబ్బు పిఎఫ్ ఖాతాలో కనిపించడం లేదా? కొన్ని సందర్భాల్లో ఎన్ని నెలలు గడిచినా పిఎఫ్ ఖాతాలో అమౌంట్ జమ కానట్లే చూపుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగం మానేసి మరొక సంస్థలోకి వెళ్లినపుడు. మునుపటి సంస్థలో కట్ అయిన మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో చూడలేరు. మీరూ అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే తక్షణమే ఈ కింది ప్రభుత్వ పోర్టల్ ద్వారా సమస్యను పరిష్కరించుకోండి. మీ PF ఖాతాకు సంబంధించిన ఏదైనా సమస్యనైనా దీని ద్వారా క్లియర్ చేసుకోండి.
EPFiGMS పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
వాస్తవానికి, PFకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ (EPFiGMS)ని సృష్టించింది. ఈ పోర్టల్‌లో ఉద్యోగులు PFకి సంబంధించిన ఏ సమస్య గురించైనా ఫిర్యాదు చేయవచ్చు. తమ సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు.
ఉద్యోగులు PF బదిలీలో జాప్యం, క్లెయిమ్ చిక్కుకుపోవడం, ఖాతాలో ఏదైనా తప్పుడు సమాచారం కనిపించకపోవడం వంటి ఫిర్యాదులకు ఈ పోర్టల్‌లో పరిష్కారాలను పొందవచ్చు. ఇది మాత్రమే కాదు. మీ ఫిర్యాదుకు ప్రతిస్పందన రావడానికి సమయం పడితే రిమైండర్‌ను కూడా పంపవచ్చు.
ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేసేటప్పుడు.. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత ఫిర్యాదు నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. కంప్లైంట్ స్టేటస్ చెక్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
ఫిర్యాదు చేయడం ఎలా?
ముందుగా Google లో EPFiGMS ఓపెన్ చేయండి.
దీని తర్వాత అక్కడ రిజిస్టర్ గ్రీవెన్స్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ PF అకౌంట్ స్థితిని ఎంచుకోండి.
మీ ఫిర్యాదు క్లెయిమ్‌కు సంబంధించినది అయితే, క్లెయిమ్ ఐడీ వివరాలను అందించండి.
UAN నంబర్‌ను నమోదు చేయండి. తర్వాత క్యాప్చా నమోదు చేసి గెట్ డీటైల్స్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ ఫోన్ నంబర్, ఇమెయిల్ ఐడీకి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి.
తర్వాత మీ ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
అనంతరం PF నంబర్‌ను ఎంచుకుని మీ ఫిర్యాదును వివరంగా రాయండి.
సమస్యకు సంబంధించిన పత్రాలను అటాచ్ చేయండి.
చివరగా మీ ఫిర్యాదును సబ్మిట్ చేయండి.
ఇవి కూడా చదవండి
యస్ బ్యాంక్ లోన్ మోసం కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ
ట్రంప్ బెదిరింపులు.. మళ్లీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు..
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి