Share News

Stock Market: ట్రంప్ బెదిరింపులు.. మళ్లీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు..

ABN , Publish Date - Aug 05 , 2025 | 10:56 AM

సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. భారత్‌పై మరింతగా సుంకాలను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.

Stock Market: ట్రంప్ బెదిరింపులు.. మళ్లీ నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు..
Stock Market

సోమవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. భారత్‌పై మరింతగా సుంకాలను పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో ఉన్నాయి (Business News).


సోమవారం ముగింపు (81, 018)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింతగా నష్టాల్లోకి జారుకుంది. ప్రస్తుతం ఉదయం 10:40 గంటల సమయంలో సెన్సెక్స్ 410 పాయింట్ల నష్టంతో 80, 608 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 115 పాయింట్ల నష్టంతో 24, 607 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో నవుమా హెల్త్, కేన్స్ టెక్నాలజీస్, మాజగాన్ డాక్, ఏపీఎల్ అపోలో, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందుస్థాన్ పెట్రో, మనప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, పీబీ ఫిన్‌టెక్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 280 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.82గా ఉంది.


ఇవి కూడా చదవండి

భారత్‌పై మరింతగా పన్నులు పెంచుతా.. డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపు..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 11:11 AM