Homemade ORS Recipe: ORS పౌడర్ లేదా?ఇంట్లోనే ఈ 3 పదార్థాలతో తయారు చేసేయండి..!
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:10 PM
సీజన్లతో సంబంధం లేకుండా డీహైడ్రేషన్ ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. చాలామంది ఇళ్లల్లో ఓఆర్‌ఎస్ పౌడర్ అందుబాటులో ఉంచుకోరు. అలాంటి సందర్భాల్లో ఇంట్లో ఉండే ఈ 3 పదార్థాలతో ORS తయారు చేసుకోవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. దీన్నెలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
Homemade ORS: శరీరం ద్రవాలు, ముఖ్యమైన లవణాలు రెండింటినీ కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ అనే సమస్య వస్తుంది. సీజన్లతో సంబంధం లేకుండా డీహైడ్రేషన్ ఎవరికైనా, ఏ సమయంలోనైనా రావచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే తక్షణమే ORS ద్రావణం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమస్య వచ్చినవారు చాలా బలహీనంగా ఉంటారు. తలతిరుగుడు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల, పిల్లలు, పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) దీనిని పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంట్లోనే దీన్నెలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇంట్లో ORS తయారీకి అవసరమైన పదార్థాలు
1 లీటరు ఫిల్టర్ చేసిన లేదా మరిగించి చల్లార్చిన శుభ్రమైన తాగునీరు
6 టీస్పూన్ల చక్కెర
½ లెవెల్ టీస్పూన్ ఉప్పు
ద్రావణాన్ని కలపడానికి శుభ్రమైన పాత్ర
ORS ద్రావణాన్ని ఎలా తయారు చేయాలి
శుభ్రమైన పాత్రలో చక్కెర, ఉప్పును నీటిలో కలపండి. అది పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపండి. ద్రావణం కొంచెం తీపిగా ఉండాలి. ఎక్కువ చక్కెర లేదా ఉప్పగా ఉండకూడదు. నిష్పత్తులను సరిగ్గా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ చక్కెర లేదా ఉప్పు ప్రమాదకరం.
ORS ఇచ్చేటప్పుడు చేయవలసినవి, చేయకూడనివి
మిశ్రమాన్ని తయారు చేయడానికి శుభ్రమైన నీరు, పాత్రలను ఉపయోగించండి.
నిమ్మకాయ, సోడా లేదా ఇతర పదార్థాలను జోడించవద్దు. కేవలం చక్కెర, ఉప్పు, నీరు మాత్రమే వాడాలి.
24 గంటలు దాటిన ORS ద్రావణాన్ని పారవేయండి.
వాంతి లేదా కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఈ ద్రావణాన్ని తీసుకోవాలి.
ORS ఇచ్చిన తర్వాత కూడా వ్యక్తి ఆరోగ్యం ఇంకా దిగజారుతున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని చూస్తే.. మీ రోజంతా మెరుగ్గా ఉంటుంది.!
వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కాదు.. ఈ వ్యాధులకు దివ్యౌషధం..!
For More Latest News